జీడిమెట్లలో మూడు రోజుల క్రితం తయారు చేసిన 80 బిర్యానీ ప్యాకెట్లను ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి, వాటిని బంజారాహిల్స్‌లోని అపార్ట్‌మెంట్ సెల్లార్ నుంచి “లక్కీ బిర్యానీ & షవర్మ” పేరుతో ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు బయటపడింది. కుళ్ళిపోయిన బిర్యానీని ఎలుకల మధ్య ఫ్రిడ్జ్‌లో ఉంచి, ఆ తర్వాత ఓవెన్‌లో వేడి చేసి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జొమాటోలో ఆర్డర్ చేసిన కస్టమర్‌కు కూడా ఇదే విధంగా పాడైన బిర్యానీ డెలివరీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై హోటల్ యజమాని ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేసి, బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.