శాసన మండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. మంత్రి వర్గం నుంచి పొంగులేటిని భర్తరఫ్ చేయాలని, అక్రమ మైనింగ్‌లో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. వెల్‌లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. అనంతరం, బీఆర్‌ఎస్ సభ్యులను ఒక రోజు పాటు మండలి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.