హైదరాబాద్: బుద్ధుని విగ్రహాన్ని కూల్చడమంటే తన మీద ఉమ్ము వేసుకున్నట్టే: లింగంగౌడ్

ప్రపంచానికి జ్ఞానం నేర్పిన బుద్ధుని విగ్రహాన్ని కూల్చడం అంటే తన మీద తాను ఉమ్ము వేసుకున్నట్టేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్యమార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడని.. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేల పాళీ భాషలో ఆయన బోధనలు చేశారని, ఆయన విగ్రహాన్ని కూల్చడం మూర్ఖుల పనేనని అన్నారు. విగ్రహాన్ని కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్