రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం: వీబీజీ రామ్‌జీ చట్టంపై తెలంగాణ అభ్యంతరం

తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో జరిగిన సమావేశంలో వీబీజీ రామ్‌జీ చట్టంపై తన అభ్యంతరాలను స్పష్టం చేసింది. మంత్రి సీతక్క మాట్లాడుతూ, కొత్త చట్టం రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపడంతో పాటు గ్రామీణ పేదల ఉపాధి హక్కులు, గ్రామ పంచాయతీల అధికారాలను బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిబంధనలను సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం తెలంగాణ తుది నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్