ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బౌన్సర్ల వ్యవస్థ రద్దు చేయాలని బుధవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తంని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు లక్షలకు లక్షల రూపాయలు వసూలు చేస్తూ కనీస మౌలిక వసతులు కల్పించడంలో విపలమయ్యారని అన్నారు.