ఖైరతాబాద్ లో ఆదివారం జరిగిన టీజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు, మీడియా యాజమాన్యాలు, పాత్రికేయ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, నిజాయితీ, నిబద్ధతతో వార్తలు అందించే వారికి మంచి గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల డీఎంఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.