ఓయోలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ఖైరతాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్రైడ్ ఓయో హోటల్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గత మూడు రోజులుగా అదే హోటల్లో యువకుడితో కలిసి ఆమె బస చేస్తుంది. మహిళ మృతి చెందిన సమయంలో గదిలో ఉన్న వ్యక్తి వెళ్లిపోయినట్లు సమాచారం. మృతురాలి శరీరంపై గాయాల ఆనవాళ్లు ఉండటంతో హత్య కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది, సీసీ కెమెరాలు, రిజిస్టర్ వివరాలను పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕