హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో పోలీసులు అక్రమ లింగ నిర్ధారణ రాకెట్‌ను భగ్నం చేశారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌పై డికాయ్ ఆపరేషన్ నిర్వహించి, హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజుతో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసును డికాయ్‌గా పంపి ఆధారాలు సేకరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తామని హామీ ఇచ్చిన నిందితులు, గర్భిణులను తుక్కుగూడలోని ఓ క్లినిక్‌కు రిఫర్ చేశారు. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్, రిసెప్షనిస్ట్ లోకేశ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.