కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ లో గురువారం కుటుంబ కలహాలు దారుణ హత్యకు దారితీశాయి. భర్త రహీం, తన భార్య సుమేరాను కోపంతో హత్య చేశాడు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన రహీం, హత్య చేసిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.