బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్ కాలనీ వీక్లీ మార్కెట్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. ఓ కారు నడుపుతున్న డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో స్టీరింగ్ అదుపు తప్పింది. యాక్టివా బైకుపై వెళ్తున్న వ్యక్తి పైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఎర్రగడ్డకు చెందినట్లు తెలిసింది. ఘటన స్థలానిక్ చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.