ఫతేనగర్‌లో మిన్నంటిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలు జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో ఉత్సాహంగా పాల్గొని మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్