సెలవుల్లో తరగతులు నిషేధం: ఎన్‌ఎస్‌యూఐ హెచ్చరిక

కూకట్‌పల్లి నియోజకవర్గంలో వేసవి సెలవుల సమయంలో ఇంటర్ కళాశాలల్లో రెగ్యులర్ తరగతులు, ప్రత్యేక కోచింగ్, బ్రిడ్జి కోర్సులు నిర్వహించడం నిషేధమని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకుడు గొల్ల జాన్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ కుందన్ యాదవ్‌తో కలిసి ఇంటర్ బోర్డు అకాడమిక్ జాయింట్ సెక్రటరీ కె. వసుంధరా దేవికి వినతిపత్రం అందజేశారు. ఎంసెట్ కోచింగ్ పేరుతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్