డ్రగ్స్ కలకలం.. ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల అరెస్ట్

హైదరాబాద్ లోని మియాపూర్ లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని నైజీరియన్ల నుండి MDMA కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు వీరిపై ఆరోపణలున్నాయి. వీరి వద్ద నుండి రూ. 1.5 లక్షల విలువైన 12.6 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హనుమంతు, మహేష్, ఆదర్శ్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్