కూకట్‌పల్లి ఏటీఎంలో అగ్నిప్రమాదం

కూకట్‌పల్లిలోని వడ్డేపల్లి ఎంక్లేవ్ వద్ద DBS ఏటీఎం సెంటర్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్