జనగణన షురూ.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో తొలివిడత జనగణన సోమవారం, మే 6న ప్రారంభమైంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి ప్రముఖులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వీయ గణన) ప్రక్రియలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల సమక్షంలో వెబ్ సైట్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణనలో ప్రజలందరూ చురుగ్గా భాగస్వాములు కావాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మే 11 వరకు ప్రజలు తమ వివరాలను స్వీయ గణన ద్వారా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్