ముఠా గోపాల్ ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

యశోద హాస్పిటల్ లో మోకాలు శాస్త్ర చికిత్స చేసుకున్న ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్ ను ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఠా గోపాల్ త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీనివాస్ గుప్తా, సుధాకర్ గుప్తా, రవి యాదవ్, శంకర్ ముదిరాజ్, శ్రీధర్ చారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕