కూకట్‌పల్లి నియోజకవర్గంలోని రామాలయంలో గరుడ, హనుమ మూర్తుల ప్రతిష్టాపన మహోత్సవాలు సోమవారం ఉదయం అగ్ని ప్రతిష్ట, హోమాదులతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మాధవరం కృష్ణారావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, యజ్ఞంలో పూర్ణాహుతిని సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.