హైదరాబాద్: పోలీసు విధుల్లో నిర్లక్ష్యం!

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. ప్రజలకు అందాల్సిన పోలీసుల సేవలు, నేరాల నియంత్రణలో అలసత్వం ఉండొద్దని ఆయన మొదటి రోజు నుంచే స్పష్టం చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ సెంట్రల్ జోన్ ఎస్ఐ డి. శ్రీకాంత్ గౌడ్, టప్పాచ్ఛాబుత్ర ఇన్ స్పెక్టర్ అభిలాష్‌లను విధి నిర్వహణలో వారి తీరుపై సమగ్ర నివేదిక అందిన తర్వాత సీపీ సస్పెండ్ చేశారు. ప్రజా సంక్షేమ పోలీసింగ్ పై దృష్టి సారించిన సీపీ, శాంతి భద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించడం లేదని స్పష్టమవుతోంది.

సంబంధిత పోస్ట్