చలివేంద్రం ప్రారంభం – జనతా నగర్‌లో వేసవి సేవా కార్యక్రమం

కూకట్‌పల్లి నియోజకవర్గం మూసాపేట్ జనతా నగర్‌లో బీఆర్ఎస్ నాయకుడు గిరీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా బాటసారులు, స్థానికుల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభినందించారు. మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేసవి కాలం ముగిసే వరకు చలివేంద్రం నిరంతరాయంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్