బస్తీల్లో మౌలిక వసతులు కల్పించాలి

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లో పెండింగ్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ కోరారు. మున్సిపల్ కమిషనర్ సృజనను కలిసి రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలని, మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్