హైదరాబాద్ మహానగరంలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల పిస్తా హౌస్, షా గౌస్, మేహిఫిల్ హోటళ్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు, ఇప్పుడు వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని, గతంలో ఐటీ దాడులు జరిగిన హోటళ్లతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. నవంబర్ 18న జరిగిన దాడుల్లో లెక్కలో లేని నగదును గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఆదాయపు పన్ను ఎగవేతదారులపై ఐటీ శాఖ దృష్టి సారించింది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.