కౌండిన్య గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా కేశవ నాథం గౌడ్ ఎన్నిక

పీర్జాదిగూడలోని కౌండిన్య (గౌడ) సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కేశవ నాథం గౌడ్ ఎన్నికయ్యారు. ఉప్పల్ డిపో సమీపంలో జరిగిన సర్వ సభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వేముల కేశవనాదం గౌడ్ అధ్యక్షుడిగా, రంగ నాగభూషణం గౌడ్ జనరల్ సెక్రెటరీగా, సత్యనారాయణ గౌడ్ ట్రెజరర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కోటి లక్ష్మణ్, ఉట్కురి లక్ష్మణ్ ఉపాధ్యక్షులుగా, పీ బాలరాజ్ గౌడ్ జాయింట్ సెక్రెటరీగా, పల్లె మల్లేష్ గౌడ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులయ్యారు. పలువురు ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులుగా, సలహాదారులుగా ఎన్నికయ్యారు. ఎలక్షన్ ఆఫీసర్ బత్తిని ముత్యాలు గౌడ్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది.

సంబంధిత పోస్ట్