కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన.. ప్రధాన నిందితుడు కూన సత్యం అరెస్టు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ఏడుగురు మరణించగా మరో 30 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కూన సత్యం గౌడ్‌ను కూకట్‌పల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మరోవైపు బాలానగర్ ఎక్సైజ్ ఎస్సైను సస్పెండ్ చేశారు. కల్తీ కల్లు డిపోలను సీజ్ చేశారు. దీనికి సంబంధించిన యాజమాన్యాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్