కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పండిత్ నెహ్రూ నగర్ లోని ఆశుర్ఖానాలో నిర్వహించిన పవిత్ర మొహరం కార్యక్రమంలో ఆదివారం కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ముస్లిం సోదర సోదరీమణులకు మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, హుస్సేన్ వలె ధర్మానికి నిలబడే తత్త్వం ప్రతి ఒక్కరిలో ఉండాలి. మొహరం మనకు త్యాగాన్ని, న్యాయాన్ని గుర్తుచేస్తుంది. మత సామరస్యానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని అన్నారు.