కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ లో సున్నం చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా బుధవారం అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ హైడ్రా అధికారులు, జలమండలి అధికారులు మరియు స్థానిక నాయకులతో కలిసి జరుగుతున్న పనులను పర్యవేక్షించడం జరిగింది. ఇందులో భాగంగానే పర్వత్ నగర్ ఫేస్ టు నుండి వస్తున్నటువంటి డ్రైనేజీ పైప్ లైన్లు పరిశీలించారు.