కూకట్ పల్లి నియోజకవర్గం బాల నగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి ఆదివారం వాహనదారుడు మృతి చెందాడు. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి తలపై నుండి ఆర్టీసీ బస్సు వెళ్లిపోయింది. సంఘటన స్థలంలోని వాహనదారుడు మృతి చెందాడు. దీంతో రోడ్డుపై వాహనదారులు ధర్నా చేస్తున్నారు.