నగరంలో గంజాయి, కెన్నాబిస్ టాబ్లెట్స్ పట్టివేత

నిజాంపేట్ జయభారతీ నగర్‌లోని విజేత సూపర్ మార్కెట్ వద్ద STF ‘డీ’ టీమ్ పోలీసులు గురువారం గంజాయి, కెన్నాబిస్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గురు సుమంత్ అనే వ్యక్తి నుంచి 200 గ్రాముల గంజాయి, 8 కెన్నాబిస్ టాబ్లెట్లతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను పట్టుకున్నారు. వైజాగ్ నుంచి సప్లై చేస్తున్న సాయి కృష్ణంరాజుపై కూడా కేసు నమోదు చేసి, కూకట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్