వి. హనుమంతరావు ఆరోగ్యంపై ఆరా తీసిన మెట్టుసాయి

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి కుమార్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వి. హనుమంతరావుతో మాట్లాడి, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్