కూకట్‌పల్లిలోని దీనబంధు కాలనీలో రోడ్డుపై చెత్త వేయొద్దని చెప్పినందుకు ఒక మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేసింది. 'నాకు చెప్పడానికి నువ్వెవరు?' అని బూతులు తిడుతూ, జుట్టు పట్టుకుని ఈడిస్తూ, చెంపలపై వాయిస్తూ విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో, దాడి చేసిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.