చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో వాహనాల రద్దీని అదుపు చేసేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ తరహా యాక్సెస్ కంట్రోల్ విధానాన్ని SC రైల్వే ప్రవేశపెట్టింది. ప్లాట్‌ఫామ్ నంబర్ 9 వద్ద ప్రత్యేక పికప్, డ్రాప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ విధానం ప్రకారం, మొదటి 20 నిమిషాలు పార్కింగ్ ఉచితం, ఆ తర్వాత నిర్ణీత రుసుము వసూలు చేస్తారు. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడమే దీని లక్ష్యమని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.