కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కూకట్‌పల్లి, దీప్తిశ్రీ నగరాల్లో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్ స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిశాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.