కూకట్పల్లి జోనల్ కమీషనర్ గా భాద్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్ అపూర్వ్ చౌహన్ ని టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి, అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ అధ్యక్షులు కర్క నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఫూల భోకేతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.