కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ చెరబండ రాజు నగర్ లో నూతనంగా అభివృద్ధి చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు మరియు దుస్తులు కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయించాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణ్ జ్యోతి, ఎంఈఓ హరీష్ చంద్ర తో పాటు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.