భరత్నగర్ కాలనీలో మూడు రోజుల నుంచి మంచినీటి సరఫరా కావటం లేదని కాలనీ వాసులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్, ఎస్ఐజీ, ఎంఐజీలలోని కొన్ని వీధుల్లో తాగడానికి కూడా మంచినీరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ ప్రజలకు ట్యాంకర్ ద్వారా నీటిని అందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.