హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల కారణంగా సిద్ధిఖ్ అనే వ్యక్తి తన అత్తింటిపై కత్తితో దాడి చేయగా, అత్త నిరంజన్ బి. అతని బామ్మర్ది భార్య రేష్మా ప్రాణాలు కోల్పోయారు. నిందితుడి నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని బాధితులు బుధవారం ఉదయం పోలీసులను ఆశ్రయించినప్పటికీ, రక్షణ కల్పించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.