సీట్ ఎదుట హాజరైన బడంగ్ పేట మాజీ మేయర్

హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బడంగ్ పేట మాజీ మేయర్ చిగురింత పారిజాత, ఆమె భర్త నరసింహ రెడ్డి సీట్ ఎదుట హాజరయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వారి వాంగ్మూలాలను అధికారులు నమోదు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీరి ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు గుర్తించిన సీట్, కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.

సంబంధిత పోస్ట్