హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ బాబూనగర్‌లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో భారీ పేలుడు మంగళవారం సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అయితే, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లు పేలకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.