హైదరాబాద్‌: దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి నగర్ సమీపంలో అనుమానంతో భార్య వసంత(52)ను భర్త నర్సింహ(60) గొడ్డలితో నరికి చంపాడు. వసంత సమీపంలోని ఇళ్లల్లో పని చేస్తుండగా, కూలి పనులు చేసుకునే నర్సింహ భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడు. నిన్న ఉదయం జరిగిన గొడవ తర్వాత, పనికి వెళ్తున్న వసంతను అడ్డుకుని నర్సింహ ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నర్సింహను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్