రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో, సిల్వర్ ప్లేట్ హోటల్ ఎదుట నిలిపిన వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనంలో రసాయన పదార్థాలు ఉన్నాయనేది ప్రాథమిక సమాచారం. మంటలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.