లారీ ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో శనివారం రాత్రి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొని బానోత్ కిషన్ (45) అనే పాదచారి అక్కడికక్కడే మృతి చెందారు. ఇందిరానగర్ యూ-టర్న్ వద్ద రోడ్డు దాటుతుండగా ఈ ఘోరం జరిగింది. పోలీసుల ప్రాథమిక విచారణలో లారీ అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలింది. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన చెందుతూ, అతివేగ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్