హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ (వీడియో)

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి, కేతేపల్లి వద్ద కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కో టోల్ గేట్ దాటడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్