హైదరాబాద్: గాంధీలో IVF విజయవంతం.. కవలల కిలకిల

పదేళ్ల నిరీక్షణకు గాంధీ ఆస్పత్రిలో తెరపడింది. సంతానం కోసం ప్రైవేట్‌లో రూ.లక్షలు ఖర్చు చేసి విఫలమైన బోయగూడకు చెందిన కూలీ దంపతులు, గాంధీ ఐవీఎఫ్‌ సెంటర్‌లో చికిత్స పొంది బుధవారం కవలలకు (ఒక బాబు, పాప) జన్మనిచ్చారు. బయట రూ.12 లక్షలయ్యే ఈ చికిత్సను వైద్యులు పూర్తిగా ఉచితంగా అందించారు. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్