పదమూడేళ్ల బాలికను 40 ఏళ్ల శ్రీనివాస్‌గౌడ్‌తో వివాహం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 28న రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలోని ఆలయంలో ఈ పెళ్లి జరిగింది. బాలిక ఉపాధ్యాయుల సమాచారం మేరకు, పోలీసులు బుధవారం బాలిక తల్లి, వరుడు, పురోహితుడు, మధ్యవర్తిపై కేసు నమోదు చేశారు. బాలికను సఖీ కేంద్రానికి తరలించారు.