రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో భూ వివాదం నేపథ్యంలో రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, జీపీవో హన్మంతును మహిళ అడ్డుకుని, గుర్తింపు కార్డు లాక్కొని దుర్భాషలాడినట్లు అధికారులు ఆరోపించారు. జీపీవో హన్మంతు కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేయగా, ఆర్ఐ ప్రేమ్‌కుమార్ కూడా చట్టపరమైన చర్యలు కోరుతూ శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.