రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఆకన్ పల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోళ్లపడకల్ నుండి వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తావుటి శ్రీకాంత్ (35), సంగెం గిరి (32) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.