హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కలిశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, ఓట్ల కోసం కొంతమంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అలాంటి వారిని తెలుగు ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. ప్రజలను చీల్చే ప్రయత్నాలు వారి సంకుచిత మనసుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణపై తన ప్రేమ, గౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరన్నారు.