పౌర సరఫరాల శాఖ కుంభకోణంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కలిసి రూ. కోట్లు దోచుకున్నారని బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడుతూ. ఆధారాలు లేని కేసులో కేటీఆర్ పైన విచారణ జరిపిన ఏసీబీ ఎక్కడుందని ప్రశ్నించారు. ఈడీకి పౌర సరపరాల శాఖలో ఇన్ని కోట్ల అవినీతి జరుగుతుంటే కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఎఫ్సీఐ చైర్ పర్సన్ గా డీకే అరుణ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.