హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లోని తిరుమలహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి బ్రేకులు ఫెయిల్ అయిన టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ డివైడర్‌ను ఢీకొని, అటుగా వెళ్తున్న మరో లారీ, బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.