కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా మొదలైన డ్రంకన్ డ్రైవ్ చెకింగ్

కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా మలక్ పేట్, దిల్సుక్ నగర్, చంపాపేట, నల్గొండ క్రాస్ రోడ్స్ లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురు పట్టుబడ్డారు. నల్గొండ క్రాస్ రోడ్స్, మలక్ పేట్ లలో గుర్తించిన మద్యం బాబుల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రేపు పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ వాహనాల డాక్యుమెంట్లను సమర్పించాలని ట్రాఫిక్ పోలీసులు వారికి సూచించారు.

సంబంధిత పోస్ట్