ఎంజీబీఎస్ లో గద్వాల్ వెళ్లే ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి పొగలు రావడాన్ని గమనించిన కండక్టర్ వెంటనే నీటితో మంటలను ఆర్పివేశారు. కండక్టర్ సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సుకు మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.